ధాన్యం సేకరణకు పక్కా ప్లాన్.. సీఎం తాజా ఆదేశం

|

Sep 29, 2020 | 3:02 PM

మరో రెండు, మూడు వారాల్లో ఏపీలో ధాన్యం సేకరణకు చర్యలు మొదలు పెట్టాలని, ప్రొక్యూర్‌మెంటుకు పక్కా ప్లాన్ వుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గిట్టుబాటు ధరలను అక్టోబర్ 1వ...

ధాన్యం సేకరణకు పక్కా ప్లాన్.. సీఎం తాజా ఆదేశం
Follow us on

Clear cut plan for paddy procurement: మరో రెండు, మూడు వారాల్లో ఏపీలో ధాన్యం సేకరణకు చర్యలు మొదలు పెట్టాలని, ప్రొక్యూర్‌మెంటుకు పక్కా ప్లాన్ వుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గిట్టుబాటు ధరలను అక్టోబర్ 1వ తేదీన ప్రకటించాలని ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతీ రైతు వివరాలు ఈ-క్రాపింగ్‌లో వుండాలని, సోషల్ ఆడిట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ప్రొక్యూర్‌మెంటుపై ధ్యాస పెట్టాలి.. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి.. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి.. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి .. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి ’’ అంటూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులను నిర్దేశించారు.

రైతులకు కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలని, ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదని, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ‘‘ సీఎం యాప్‌ ద్వారా మానిటరింగ్‌ జరగాలి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే అలర్ట్‌ చేయాలి .. జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్‌ సౌకర్యం చూపాలి .. ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్‌ 1న రిలీజ్‌ చేస్తాం.. అక్టోబర్‌ 5 కల్లా అన్ని ఆర్‌బికేలలో డిస్‌ప్లే చేయాలి ’’ అని మంగళవారం నాటి సమీక్ష సమావేశంలో సీఎం నిర్దేశించారు.

కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు పంటను అమ్మించగలగాలని, రైతులకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయనన్నారు. స్టేట్‌ లెవల్‌ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్‌బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలని, రైతులు నష్టపోతే అందరూ నష్టపోతారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.