కరోనా ఎఫెక్ట్: సెల్‌ఫోన్‌నూ శుభ్రపరచాల్సిందే..!

| Edited By:

Mar 25, 2020 | 3:52 PM

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్‌. పెద్ద, చిన్నా తేడాలేదు.

కరోనా ఎఫెక్ట్: సెల్‌ఫోన్‌నూ శుభ్రపరచాల్సిందే..!
Follow us on

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్‌. పెద్ద, చిన్నా తేడాలేదు. అయితే మనం నిత్యం వాడే ఫోన్‌ వెలుపలి భాగం అనేక క్రిముల మయం. వాస్తవానికి మన చేతుల కంటే ఫోనే ముఖానికి ఎక్కువగా తాకుతుంటుంది. దీనివల్ల క్రిములు తేలిగ్గా మన నుంచి ఫోన్‌కు చేరతాయి. అందువల్ల మీ ఫోన్‌ శుభ్రంగా లేకపోతే ఎన్నిసార్లు శుభ్రంగా చేతులు కడుక్కొన్నా, శానిటైజర్లు వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం జబ్బులకు ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి. అందుకే తరచుగా చేతులతోపాటు ఫోన్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే. ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌తో ఫోన్‌ను శుభ్రపరచుకుంటే చాలావరకు క్రిములు చనిపోయే అవకాశం ఉంది.

కాగా.. ఫోన్‌ శుభ్రం చేయడానికి ఎలాంటి రసాయన ద్రవాలు వాడొద్దని యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలు సూచిస్తున్నాయి. రసాయనాల వల్ల స్ర్కీన్‌ కోటింగ్‌ దెబ్బతిని టచ్‌ ఫీచర్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఫింగర్‌ ప్రింటింగ్‌ సెన్సార్‌ ఫోన్లు శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్‌ వస్త్రాన్ని వాడొచ్చు. ఎక్కువగా కాల్స్‌ చేసేవాళ్లు హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్‌ వాడటం మంచిది. దీనివల్ల ఫోన్‌ మీద ఉండే క్రిములు మొహానికి చేరే అవకాశం తక్కువ. అయితే హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ కూడా శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి.