షాకింగ్..హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్..

|

Jan 19, 2020 | 4:30 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న మైనర్ బాలిక కాలేజ్ హాస్టల్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంగా చెప్పుకునే దంతేవాడ జిల్లా పతర్రాస్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఇన్ని నెలలు గర్బంతో ఉన్నా కనీస అవగాహన లేకపోవడంతో హాస్టల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా గత రెండేళ్లుగా బాలిక తన […]

షాకింగ్..హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్..
Follow us on

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న మైనర్ బాలిక కాలేజ్ హాస్టల్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంగా చెప్పుకునే దంతేవాడ జిల్లా పతర్రాస్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఇన్ని నెలలు గర్బంతో ఉన్నా కనీస అవగాహన లేకపోవడంతో హాస్టల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా గత రెండేళ్లుగా బాలిక తన గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు విషయం దాచిపెట్టానని యువతి అధికారుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఆమె జన్మనిచ్చిన మృత శిశువును బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలితో పాటు ఆస్పత్రి సిబ్బందిని,  తోటి విద్యార్థినులను విచారిస్తున్నారు.