మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ ఆగిపోయిందా..?

చిరంజీవి సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండ‌దు. ఆయ‌న సినిమా అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు.

మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ ఆగిపోయిందా..?
Follow us

|

Updated on: Jul 18, 2020 | 3:07 PM

చిరంజీవి సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండ‌దు. ఆయ‌న సినిమా అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యిందంటే పూన‌కాలతో ఊగిపోతారు. కాగా ప్ర‌స్తుతం చిరంజీవి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ మూవీ అనంత‌రం లూసిఫర్ రీమేక్ లో నటించ‌నున్నాడు చిరు. ఆ ప్రాజెక్ట్ బాధ్య‌తలు యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కు అప్ప‌గించింది మెగా కాంపౌండ్. అయితే ఇటీవ‌లే సుజీత్ డెవ‌ల‌ప్ చేసిన స్క్రిప్ట్ విన్న చిరు..అంత ఇంప్రెస్ అవ్వ‌లేదట‌. పూర్తిగా నిరాశ చెంది..ఈ బాధ్యత‌ల‌ను సీనియ‌ర్ డైరెక్టర్ వివి వినాయ‌క్ కు అప్ప‌గించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా చిరు సినిమాకు సంబంధించి మ‌రో అప్ డేట్ ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్ల కొడుతుంది.

మ‌రో యువ ద‌ర్శ‌కుడు బాబీ చెప్పిన కొత్త‌ లైన్ చిరంజీవికి బాగా నచ్చింద‌ట‌. దీంతో దాన్ని మ‌రింత డెవ‌ల‌ప్ చేసుకుని ర‌మ్మ‌న్నార‌ట. ఆ స్క్రిప్ట్ గానీ ఫైన‌ల్ అయితే లూసిఫ‌ర్ రీమేక్ కొన్నాళ్ళు ప‌క్క‌న‌బెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.