మృగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి: చిరంజీవి

| Edited By:

Dec 06, 2019 | 4:22 PM

ధిశ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అత్యాచారాలు హత్యలు చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. ఆడపిల్లల పట్ల నీచంగా వ్యవహరించే ఉన్మాదుల పట్ల శిక్షలు చాలా కఠినంగా ఉండాలన్నారు. “గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు.. ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బ్రతుకుతోందని అనిపిస్తుంది. మనసు కలచివేసే ఈ సంఘటనల గురించి ఒక అన్నగా,  ఒక తండ్రిగా […]

మృగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి: చిరంజీవి
Follow us on

ధిశ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అత్యాచారాలు హత్యలు చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. ఆడపిల్లల పట్ల నీచంగా వ్యవహరించే ఉన్మాదుల పట్ల శిక్షలు చాలా కఠినంగా ఉండాలన్నారు. “గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు.. ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బ్రతుకుతోందని అనిపిస్తుంది. మనసు కలచివేసే ఈ సంఘటనల గురించి ఒక అన్నగా,  ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాల కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు. త్వరగా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు. ఆడపిల్లలందరికి నేను చెప్పేది ఒక్కటే.. మీ ఫోన్ లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో హ్యాక్-ఐ ఆప్ ను డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బటన్ నొక్కితే చాలు షి టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకుంటాయి. మహిళలకు రక్షణ కల్పించటం.. వారిని గౌరవించటం ప్రతి ఒక్కరి బాధ్యత” అని చిరంజీవి వివరించారు.