క‌రోనా వ్యాక్సిన్​ : చైనా ముంద‌డుగు..రెండో ద‌శ‌ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి

|

Jun 15, 2020 | 6:24 AM

కోవిడ్-19 కు వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలో ప్ర‌పంచ దేశాలు కీల‌క ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్ర‌మంలో ​ చైనా ముందడుగు వేసింది. బాధితులపై ప్రయోగించిన వైరస్​ వ్యాక్సిన్.. ఫ‌స్ట్, రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​​ స‌క్సెస్ అయిన‌ట్లు సినోవాక్​ బయోటెక్​ సంస్థ ప్రకటించింది.

క‌రోనా వ్యాక్సిన్​ : చైనా ముంద‌డుగు..రెండో ద‌శ‌ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి
Follow us on

కోవిడ్-19 కు వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలో ప్ర‌పంచ దేశాలు కీల‌క ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్ర‌మంలో ​ చైనా ముందడుగు వేసింది. బాధితులపై ప్రయోగించిన వైరస్​ వ్యాక్సిన్.. ఫ‌స్ట్, రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​​ స‌క్సెస్ అయిన‌ట్లు సినోవాక్​ బయోటెక్​ సంస్థ ప్రకటించింది. వ్యాధి నిరోధక శక్తి బ‌ల‌ప‌డ‌టాన్ని గుర్తించినట్లు వెల్ల‌డించింది. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల మొత్తం 743 మంది బాధితుల‌పై క్లినికల్​ ట్రయల్ చేసినట్లు తెలిపింది. వీరిలో ఫ‌స్ట్ ఫేజ్ లో 143 మందిపై, సెకండ్ ఫేజ్ లో 600 మందిపై ప్రయోగం చేసినట్లు వివ‌రించింది. రెండు సార్లు టీకాలను వేసిన‌ 14 రోజుల వరకు 90 శాతం మందిలో యాంటిబాడీలు కానిస్టెంట్ గా ఉన్నట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఇక‌ ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్ క‌నిపించ‌లేద‌ని తెలిపింది. రెండు దశలు ట్ర‌య‌ల్స్ స‌క్సెస్ అవ్వ‌డంతో మూడో దశ ట్రయల్ నిర్వహించేందుకు ప‌ర్మిష‌న్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది సంస్థ.

మూడో ట్రయల్​ను చైనా బ‌య‌ట‌ ప్రయోగించనున్నట్లు పేర్కొంది . దీని కోసం బ్రెజిల్​లోని ఇన్‌స్టిట్యూట్​ బుటాంటన్‌ సంస్థతో కలిసి వ‌ర్క్ చేయ‌నున్న‌ట్లు వివ‌రించింది. మొదటి, రెండో దశలో వచ్చిన ఫలితాలు పాజిటివ్ ఎన‌ర్జీ ఇచ్చాయ‌ని, ప్ర‌మాద‌క‌ర కోవిడ్-19 నియంత్రించేందుకు మరో మైలు రాయిని చేరినట్లు సినోవాక్​ సీఈఓ వీడాంగ్ ఆనందం వ్య‌క్తం చేశారు​. కోవిడ్-19 బాధపడుతున్న వారిని కాపాడేందుకు అవసరమైన వ్యాక్సిన్​ డోసులను తయారు చేస్తున్నట్లు తెలిపిన వీడాంగ్​… వైరస్​ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు శాయ‌శక్తుల ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు.