వ్యాక్సిన్ అందరికీ వద్దు.. ఫ్రంట్ వారియర్స్ వరకే సరిపోతుందిః చైనా

|

Sep 15, 2020 | 11:12 AM

వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా కట్టడిలోకి వచ్చిందని భావిస్తున్న చైనా ప్రభుత్వం ఈ సమయంలో ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది.

వ్యాక్సిన్ అందరికీ వద్దు.. ఫ్రంట్ వారియర్స్ వరకే సరిపోతుందిః చైనా
Follow us on

ప్రపంచాన్న కరోనా మహమ్మారి ఓ పక్క కుదిపేస్తోంది. కోట్లాది మంది వైరస్ ధాటికి విలవిలలాడుతున్నారు. రాకాసి వైరస్ ను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా కట్టడిలోకి వచ్చిందని భావిస్తున్న చైనా ప్రభుత్వం ఈ సమయంలో ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. కరోనాతో ముందుండి పోరాడే వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుందనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించాల్సిన అవసరం లేదంటోంది.

చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన కొవిడ్-19 ప్రపంచాన్ని చుట్టేసింది. కరోనా విస్తరిస్తున్న నాటి నుంచీ.. విడతల వారీగా చైనాపై దాడి చేస్తున్నా ప్రతిసారీ ఆ దేశం సమర్థవంతంగా నివారిస్తూ వస్తోంది. అదే సమయంలో ప్రజలందరికీ టీకా అందించే విషయంలో లాభనష్టాల అంశాలను క్షుణ్ణంగా అంచనా వేయవలసిన అవసరం ఉందని చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. అరుదుగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్‌ ప్రభావం కూడా ఉండవచ్చన్నారు. ‘ప్రస్తుతం ప్రజలందరికీ టీకా వేయాల్సిన అవసరం లేదు. అయితే.. భవిష్యత్తులో కరోనా తీవ్రత పెరిగితే ఈ విధానంలో మార్పు రావచ్చు’ అని కూడా ఆయన స్పష్టం చేశారు.

కాగా.. కరోనా టీకా ఎప్పుడొస్తుందా అని ప్రపంచం మొత్తంగా ఆశగా ఎదురుచూస్తుంది. వ్యాక్సిన్ ద్వారా తమ ప్రజలను ఎప్పుడు గట్టేక్కిస్తామని ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం ఫ్రంట్ లైన్ సిబ్బందికి మాత్రమే టీకా ఇచ్చే యోచనలో ఉంది. ఆది నుంచి చైనా ఇతర దేశాలకంటే భిన్నమైన పంథానే ఎంచుకుందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కు సంబంధించిన వాస్తవాలను చైనా ఎప్పటికప్పుడు దాటవేస్తుందని నిపుణులు వాదనలకు బలం చేకుర్చుతున్నట్లు కనిపిస్తుంది.