ప్రధాని మోదీ ప్రసంగంతో సెట్ అయ్యింది

|

Aug 17, 2020 | 9:38 PM

చైనా, భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపించింది. ఇరు దేశాల మధ్య పరస్సరం విశ్వాసం పెరగడానికి, విభేదాలు తొలగించుకోడానికి సానుకూల ధోరణితో..

ప్రధాని మోదీ ప్రసంగంతో సెట్ అయ్యింది
Follow us on

వైరం కాదు.. భారత్‌తో తాము స్నేహమే కోరుకుంటామంటోంది చైనా. ఎర్రకోట మీదుగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చైనా, భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపించింది. ఇరు దేశాల మధ్య పరస్సరం విశ్వాసం పెరగడానికి, విభేదాలు తొలగించుకోడానికి సానుకూల ధోరణితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగశాఖ సోమవారం ప్రకటించింది.

ద్వైపాక్షి సంబంధాలను పెంపొందించుకోడానికి దశల వారిగా ఆచరణాత్మక సహకారాన్ని కోరుతున్నామని చెప్పుకొచ్చింది. భారత్‌ -చైనాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి ముందుగా ఒకరినొకరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇండిపెండెన్స్‌ డే రోజు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చైనా గుండెళ్లో గుణపాలుగా దిగాయి. లద్దాక్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణనను ప్రస్తావించిన ప్రధాని మోదీ, మన సైనికుల సామర్థ్యం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఎల్‌ఓసీ (LoC) నుంచి ఎల్‌ఏసీ (LaC) దాకా భారత సార్వభౌధికారం వైపు ఎవరు కన్నెత్తి చూసినా, సరిహద్దుల్లోని బలగాలు వారికి అర్థమయ్యే భాషలో స్పందిచాయంటూ ఇటు పాకిస్తాన్‌, అటు చైనాలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చైనా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

భారత్‌-చైనాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు రెండు దేశాల అభివృద్ధిని మాత్రమే కోరుకోవని, స్థిరత్వం, శాంతితోపాటు ప్రపంచ శ్రేయస్సుకు కూడా కోరుకుంటాయని చెప్పుకొస్తోంది చైనా. గాల్వాన్‌ ఘటన తర్వాత చైనా పట్ల భారత వైఖరి స్పష్టం కావడం, పోరాటానికి సిద్దమని ఎర్రకోట సాక్షిగా మరోసారి ప్రకటించడంతో చైనా తోక ముడిచినట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మోదీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చైనా మీడియా కూడా విశ్లేషించింది.