యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు

| Edited By:

Jul 13, 2020 | 10:09 PM

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంతతి విదితమే. అంశాన్ని ఇటీవల న్యూఢిల్లీతో జరిపిన చర్చల్లో చైనా ప్రస్తావించింది. దౌత్య స్థాయిలో జరిగిన

యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు
Follow us on

Security Reasons: గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ అంశాన్ని ఇటీవల న్యూఢిల్లీలో జరిపిన చర్చల్లో చైనా ప్రస్తావించింది. దౌత్య స్థాయిలో జరిగిన సమావేశంలో తమ మొబైల్ అప్లికేషన్లను నిషేధించడంపై చైనా ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు భారత్ దీటుగా సమాధామిచ్చిందని, భద్రతాంశాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని, తమ పౌరుల డాటాకు సంబంధించిన అంశాల్లో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్, హలో తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను గత జూన్ 29న భారత్ నిషేధించింది. జాతీయ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందన్న కారణంగా వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ డాటాను సేకరించి, దానిని బయటకు పంపించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది. దీనిపై చైనా స్పందిస్తూ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల లీగల్ హక్కులను పరిరక్షించే బాధ్యత ఇండియాకు ఉందని పేర్కొంది.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 15 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం..