చెన్నైకి చేరుకున్న చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్

| Edited By:

Oct 11, 2019 | 3:55 PM

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. జిన్‌పింగ్ రాక సందర్భంగా కళాక్షేత్ర వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మైలాపూర్‌ కపాలేశ్వర స్వామి ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా ట్రాన్స్‌లేటర్ జిన్‌పింగ్‌కు వివరించారు. విమానాశ్రయం నుంచి […]

చెన్నైకి చేరుకున్న చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్
Follow us on

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. జిన్‌పింగ్ రాక సందర్భంగా కళాక్షేత్ర వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మైలాపూర్‌ కపాలేశ్వర స్వామి ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా ట్రాన్స్‌లేటర్ జిన్‌పింగ్‌కు వివరించారు. విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్‌ గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే మహాబలిపురానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతల మధ్య అనధికారికంగా జరిగే రెండో సమావేశం ఇది. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారో అన్నదానిపై ఆసక్తి నెలకొంది.