చిత్తూరులో చైనా యువకుని అరెస్టు.. ఎందుకంటే?

|

Oct 28, 2020 | 6:50 PM

మిషనరీ బిగించేందుకొచ్చి చీటింగ్ చేసిన ఓ చైనా యువకునిపై చిత్తూరు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది. మిషనరీ బిగించలేక అనవసరమైన కేబుళ్ళను కట్ చేసి స్థానిక కంపెనీకి నష్టం కలిగించినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

చిత్తూరులో చైనా యువకుని అరెస్టు.. ఎందుకంటే?
Follow us on

China man arrested in Chittur district: మిషనరీ బిగించేందుకొచ్చి చీటింగ్ చేసిన ఓ చైనా యువకునిపై చిత్తూరు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది. మిషనరీ బిగించలేక అనవసరమైన కేబుళ్ళను కట్ చేసి కోట్ల రూపాయల మేర నష్టం కలిగించాడన్న అభియోగంపై పోలీసులు సదరు చైనా యువకునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేవలం 5 లక్షల రూపాయల ఒప్పందాన్ని నెరవేర్చ లేక.. పది కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించాడంటున్నా సదరు కంపెనీ యజమాని.

చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో చైనా యువకునిపై కేసు నమోదైంది. ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున దాని మేనేజర్.. చైనా నుంచి వచ్చిన ఫాంగ్ చెంజెస్‌పై ఫిర్యాదు చేశాడు. చైనాకు చెందిన జోయొంగ్ హుయి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మిషనరీ బిగించేందుకు ఫాంగ్ చెంజెస్ ఇండియా వచ్చాడు. 5 లక్షల రూపాయలతో మిషనరీ బిగించేందుకు చెంజెస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ మిషనరీ బిగించే క్రమంలో అనవసరమైన కేబుళ్ళను చెంజెస్ కట్ చేశాడని, ఫలితంగా తమ సంస్థకు 10 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెంజెస్‌పై ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున దాని మేనేజర్ ఫిర్యాదు చేశాడు.

అయితే, నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కేబుళ్ళను కట్ చేశాడని, జోయొంగ్ హుయి సంస్థ ప్రేరేపించడం వల్లనే కేబుళ్ళను కట్ చేశాడని ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున దాని మేనేజర్ ఆరోపిస్తున్నాడు. మేనేజర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 406 కింది చెంజెస్‌పై కేసు నమోదు చేశారు. రిమాండుకు తరలించారు.

Also read: రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Also read: పోతుల సునీత షాకింగ్ డెసిషన్

Also read: సొంత సీఎం కేండిడేట్‌పై మోదీ సెటైర్లు

Also read: ఏపీ పోలీస్ దేశంలోనే నెంబర్ 1.. ఎందులోనంటే..?