సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కన్నుమూత

|

Sep 09, 2020 | 6:25 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కన్నుమూశారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు బొమ్మర వెంకటేశం కరోనాతో మృతి చెందారు. గత వారం రొజుల క్రితం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కన్నుమూత
Follow us on

TS Chief Minister KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కన్నుమూశారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు బొమ్మర వెంకటేశం కరోనాతో మృతి చెందారు. గత వారం రొజుల క్రితం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆయనను అక్కడికి తరలించారు. అయితే ప్రారంభంలో ఆరోగ్యం కుదుటపడుతున్నట్లే కనిపించింది. ఆ తర్వాత వేగంగా క్షీణించింది.

బొమ్మర వెంకటేశం.. స్వస్థలం సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం చెర్వాపూర్‌. ఆయన కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌గా రెండు పర్యాయాలు కొనసాగారు. మే 11, 2018లో వెంకటేశం తొలిసారి ఆలయ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మే 10, 2019 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. తిరిగి అక్టోబర్ 24, 2019లో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆలయ ఛైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశం మృతిపట్ల ఆలయ ఈవో మారుతి, అర్చకులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.

వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం కాళేశ్వర దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతూ చనిపోయారు. వెంకటేశం మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యాక్తం చేశారు.