టిటిడి ఆస్తుల అమ్మకంపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

| Edited By:

May 24, 2020 | 4:56 PM

టిటిడి ఆస్తుల అమ్మకంపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని టిటిడి ఆస్తుల నిర్వహణ చాలా కష్టంగా మారిందని తెలిపారు. కొన్ని చోట్ల రూపాయి లీజుకు భూములు ఇచ్చేస్తున్నాం.

టిటిడి ఆస్తుల అమ్మకంపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Follow us on

Sale of TTD assets: టిటిడి ఆస్తుల అమ్మకంపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని టిటిడి ఆస్తుల నిర్వహణ చాలా కష్టంగా మారిందని తెలిపారు. కొన్ని చోట్ల రూపాయి లీజుకు భూములు ఇచ్చేస్తున్నాం. టిటిడికి చెందిన నాలుగువందల కల్యాణ మండపాలు ఎవరైనా కోరితే నిర్వహిస్తామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని కల్యాణ మండపాల్లో కనీసం ఏడాదికి ఒక్క పెళ్లి కూడా జరగడం లేదు.. కానీ ఆయా కళ్యాణ మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటోందని వివరించారు.

ఇలా నిర్వహణ కోసం ఖర్చు పెట్టుకుంటూ పోతే టిటిడి ఆస్తులన్ని కరిగిపోతాయన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో, టిటిడి పాలకమండలిలో దేవుడి మీద భక్తి కంటే భయం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని స్పష్టంచేశారు. భగవంతుడి విషయంలో రాజకీయాలు చేయమని తెలిపారు.

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!