హ్యాట్సాఫ్ లక్ష్మణ్‌… నువ్వు తోపు గురూ!

| Edited By: Anil kumar poka

Aug 27, 2019 | 6:51 AM

చెన్నైకి చెందిన ఓ సెక్యురిటీ రీసెర్చర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని కనుగొని ఆ సంస్థ నుంచి నగదు బహుమతిని అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణ్‌ ముథియా అనే చెన్నైకి చెందిన సెక్యురిటీ రీసెర్చర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమ ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహించిన బగ్‌ బౌంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో లోపాన్ని కనుగొన్నారు. కొత్తగా రూపొందించిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను సైతం హ్యాక్‌ చేసి స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చని నిరూపించారు. […]

హ్యాట్సాఫ్ లక్ష్మణ్‌... నువ్వు తోపు గురూ!
Follow us on

చెన్నైకి చెందిన ఓ సెక్యురిటీ రీసెర్చర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని కనుగొని ఆ సంస్థ నుంచి నగదు బహుమతిని అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణ్‌ ముథియా అనే చెన్నైకి చెందిన సెక్యురిటీ రీసెర్చర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమ ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహించిన బగ్‌ బౌంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో లోపాన్ని కనుగొన్నారు. కొత్తగా రూపొందించిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను సైతం హ్యాక్‌ చేసి స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చని నిరూపించారు. దీంతో ఆ సంస్థ తమ లోపాన్ని వెల్లడించినందుకు ఆ వ్యక్తికి రూ.7లక్షల నగదు బహుమతి ప్రకటించింది.

అయితే ఈ సంస్థ ఇతడికి ఇలా నగదు బహుమతిని అందజేయడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెలలో కూడా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ బగ్‌బౌంటీ నిర్వహించగా లక్ష్మణ్‌ ముథియా వ్యక్తుల అనుమతి లేకుండా యాప్‌ను లాగిన్‌ చేసే ఉపాయాన్ని కనుగొన్నారు. పాస్‌వర్డ్‌ రీసెట్‌ సమయంలో రిజిస్టర్‌ మెయిల్‌కు వచ్చే కోడ్‌ తెలుసుకోవడం సులువేనని నిరూపించారు. దీంతో అప్పుడు ఫేస్‌బుక్‌ అతడికి ఆ లోపాన్ని గుర్తించినందుకు రూ.20లక్షల నగదు బహుమతి ప్రకటించింది. అప్పుడు అతడు కనుగొన్న లోపాల్ని ఆ సంస్థ సవరించుకుంది.