‌బెజ‌వాడ క‌న‌క‌దుర్గమ్మ దర్శనం ఈ సమయాల్లోనే..

|

Sep 10, 2020 | 9:38 PM

బెజ‌వాడ క‌న‌క‌దుర్గమ్మ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. క‌రోనా విస్త‌ర‌ణ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ప్రతిరోజు ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనాలు కొన‌సాగుతున్నాయి.

‌బెజ‌వాడ క‌న‌క‌దుర్గమ్మ దర్శనం ఈ సమయాల్లోనే..
Follow us on

‌బెజ‌వాడ క‌న‌క‌దుర్గమ్మ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. క‌రోనా విస్త‌ర‌ణ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ప్రతిరోజు ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనాలు కొన‌సాగుతున్నాయి. అయితే, ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితిలో మార్పు లేన‌ప్ప‌టికీ కరోనా  నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటిస్తూ ఆల‌యంలో ద‌ర్శ‌నాల ఉంటాయని తెలిపారు. ఆలయం  వేళ‌లు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 8 గంట‌ల వ‌ర‌కు పొడిగించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు.

దీంతో శుక్ర‌వారం నుంచి అమ్మ‌వారు భ‌క్తుల‌కు రోజూ 14 గంట‌ల చొప్పున ద‌ర్శ‌నం కల్పించనున్నారు. కాగా, కరోనా విజృంభ‌ణ మొద‌లైన‌ప్ప‌టి నుంచి దుర్గగుడిలో భక్తులు అమ్మవారి సేవల్లో ప్రత్యక్షం పాల్గొనే అవకాశాన్ని నిపిలివేశారు. రేపటి నుంచి భక్తులు ప్రతిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు జరుగనున్న అమ్మవారి పంచహారతుల సేవలో పరిమిత సంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి సేవల టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో కూడా అందుబాటు ఉన్నాయి. మీ సేవా సెంటర్ల ద్వారా కూడా భక్తులు అమ్మవారి సేవ టికెట్ల‌ను పొందవచ్చని బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు తెలిపారు.