విజయవంతంగా మరో కక్ష్యలోకి చంద్రయాన్-2

| Edited By:

Jul 27, 2019 | 7:49 AM

చంద్రయాన్-2‌ ప్రయోగంలో అన్ని ప్రక్రియలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చంద్ర కక్ష్యలోకి చేరువు చేసేందుకు ఇస్రో చేస్తున్న మరో ప్రయత్నం కూడా శుక్రవారం విజయవంతమైంది. తెల్లవారు జామున 1.08 గంటలకు చంద్రయాన్ మాడ్యూల్ కక్ష్యను పెంచారు. అనుకున్న విధంగానే ఈ ప్రక్రియ జరిగిందని ఇస్రో వెల్లడించింది. 251 కిలోమీటర్ల పెరీజీ, 54,829 కిలోమీటర్ల అపోజీ ఉండే కక్ష్యలోకి మార్పు చేశారు. ప్రయోగం చేపట్టిన తర్వాత ఇలా చేయడం ఇది రెండోసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 24న […]

విజయవంతంగా మరో కక్ష్యలోకి చంద్రయాన్-2
Follow us on

చంద్రయాన్-2‌ ప్రయోగంలో అన్ని ప్రక్రియలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చంద్ర కక్ష్యలోకి చేరువు చేసేందుకు ఇస్రో చేస్తున్న మరో ప్రయత్నం కూడా శుక్రవారం విజయవంతమైంది. తెల్లవారు జామున 1.08 గంటలకు చంద్రయాన్ మాడ్యూల్ కక్ష్యను పెంచారు. అనుకున్న విధంగానే ఈ ప్రక్రియ జరిగిందని ఇస్రో వెల్లడించింది. 251 కిలోమీటర్ల పెరీజీ, 54,829 కిలోమీటర్ల అపోజీ ఉండే కక్ష్యలోకి మార్పు చేశారు. ప్రయోగం చేపట్టిన తర్వాత ఇలా చేయడం ఇది రెండోసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 24న తొలిసారిగా నిర్వహించామని.. మూడోదఫా ఈ నెల 29న ఉండనుందని వెల్లడించారు.