మీరే నిజమైన హీరోలు: మహేశ్‌బాబు

| Edited By:

Sep 07, 2019 | 7:26 PM

చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. మిషన్‌మూన్‌ విఫలమైనా, ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘మహర్షి’ చిత్రంలోని ఆయన డైలాగ్‌లను పంచుకుంటూ… ”సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఎ డెస్టినీ. ఇట్స్‌ ఎ జర్నీ’ చంద్రయాన్‌-2తో ఇస్రో చరిత్రాత్మక ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన […]

మీరే నిజమైన హీరోలు: మహేశ్‌బాబు
Follow us on

చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. మిషన్‌మూన్‌ విఫలమైనా, ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘మహర్షి’ చిత్రంలోని ఆయన డైలాగ్‌లను పంచుకుంటూ…

”సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఎ డెస్టినీ. ఇట్స్‌ ఎ జర్నీ’ చంద్రయాన్‌-2తో ఇస్రో చరిత్రాత్మక ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్‌ చేస్తున్నా. మీరే మా నిజమైన హీరోలు. మీతో మేమున్నాం. మన విజయ గాథకు ఇదే ఆరంభం. ఇదే మార్గం.” అని ట్వీట్‌ చేశారు. ‘మిషన్‌ మూన్‌’కు సంబంధించి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులతో సహా సామాన్యులు సైతం ఇస్రో కృషిని కొనియాడారు. ‘అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించిన శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నాను’ అని మహేష్ పేర్కొన్నారు.

[svt-event date=”07/09/2019,7:14PM” class=”svt-cd-green” ]