Chandrayaan 2 : విక్రమ్ ల్యాండర్ అడ్రస్ దొరికిందోచ్..

| Edited By:

Sep 08, 2019 | 2:57 PM

చంద్రయాన్2 ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత పురోగతి సాధించారు. శనివారం తెల్లవారుజామున1.40 గంటల సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకింత నిరాశకు గురయ్యారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. అప్పటి నుంచి ల్యాండర్ ఆచూకీ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు 24 గంటల్లోనే సైంటిస్టులు విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనగలిగారు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ […]

Chandrayaan 2 : విక్రమ్ ల్యాండర్ అడ్రస్ దొరికిందోచ్..
Follow us on

చంద్రయాన్2 ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత పురోగతి సాధించారు. శనివారం తెల్లవారుజామున1.40 గంటల సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకింత నిరాశకు గురయ్యారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. అప్పటి నుంచి ల్యాండర్ ఆచూకీ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు 24 గంటల్లోనే సైంటిస్టులు విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనగలిగారు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ఇమేజ్‌ను కనుగొన్నట్టు ఇస్రో చీఫ్ కె.శివన్ ప్రకటించారు. అయితే, విక్రమ్ లాండర్‌తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదన్నారు. విక్రమ్ లాండర్‌తో మళ్లీ లింక్ కావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే దీన్ని సాధిస్తామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.