చంద్రుడికి దగ్గరగా చంద్రయాన్ 2.. మరో 11 రోజుల్లో..

| Edited By:

Aug 28, 2019 | 2:04 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం ‘చంద్రయాన్ 2’లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ తాజాగా మూడో లూనార్ బౌండ్ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ‘చంద్రయాన్ 2’ చంద్రుడికి 179 కి.మీ x 1412 కి.మీల దూరంగా ఉన్న కక్ష్యలో ఉండగా.. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.04గంటలకు ఆ కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఇక ఆగష్టు 30నాటికి తదుపరి కక్ష్యలోకి ప్రవేశించే అవకాశం ఉందని […]

చంద్రుడికి దగ్గరగా చంద్రయాన్ 2.. మరో 11 రోజుల్లో..
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం ‘చంద్రయాన్ 2’లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ తాజాగా మూడో లూనార్ బౌండ్ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ‘చంద్రయాన్ 2’ చంద్రుడికి 179 కి.మీ x 1412 కి.మీల దూరంగా ఉన్న కక్ష్యలో ఉండగా.. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.04గంటలకు ఆ కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఇక ఆగష్టు 30నాటికి తదుపరి కక్ష్యలోకి ప్రవేశించే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 7నాటికి చంద్రయాన్ 2 చంద్రుడి మీదకు చేరే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఇటీవల వెల్లడించారు. కాగా జూలై 22న నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించగా.. దాదాపు 23 రోజులు భూకక్ష్యలో తిరిగిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్.. ఆగష్టు 14న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.