ఆపరేషన్ చిత్తూరు.. చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి?

| Edited By: Pardhasaradhi Peri

Oct 30, 2019 | 7:35 AM

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో యాక్టివిటీస్‌ బాగా తగ్గాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో.. ఎక్కడా పార్టీలో హడావుడి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుప్పం నుంచి టీడీపీ తరపున చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగతా ఎవ్వరూ గెలవలేదు. చంద్రబాబు జిల్లాపై ఫోకస్‌ పెట్టకపోవడంతో నేతలు యాక్టివిటీ తగ్గించారు. ఇటు కేడర్‌ కూడా డల్‌ అయిపోయింది. తిరుపతి నుంచి పోటీ […]

ఆపరేషన్ చిత్తూరు.. చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Follow us on

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో యాక్టివిటీస్‌ బాగా తగ్గాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో.. ఎక్కడా పార్టీలో హడావుడి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుప్పం నుంచి టీడీపీ తరపున చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగతా ఎవ్వరూ గెలవలేదు. చంద్రబాబు జిల్లాపై ఫోకస్‌ పెట్టకపోవడంతో నేతలు యాక్టివిటీ తగ్గించారు. ఇటు కేడర్‌ కూడా డల్‌ అయిపోయింది.

తిరుపతి నుంచి పోటీ చేసిన సుగుణమ్మ.. నగరిలో భాను ప్రకాష్‌  పార్టీ కార్యక్రమాల్లో తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. అటు శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసిన బొజ్జల సుధీర్‌ హైదరాబాద్‌కు పరిమితం కాగా.. చంద్రగిరి అభ్యర్థి పులి నాని నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన్ని జిల్లా బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీలోనే కొందరు నేతలు కోరుతున్నారు. ఇలా పార్టీలోని అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు.. తప్పితే కేడర్‌ను మాత్రం కలవడం లేదు. వైసీపీ దూకుడుకు కేడర్ మొత్తం చెల్లాచెదురవుతోంది. వారిని ఒకతాటిపై నడిపించే నేత లేకపోవడం ఇప్పుడు లోటుగా మారింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెలలో జిల్లా పర్యటనకు రానున్నారు. ఇక జిల్లా కేడర్‌కు భరోసా ఇచ్చే నేతను కూడా ఈ మీటింగ్‌లో ఎంపిక చేస్తారని తెలుస్తోంది.