కోడెలది ప్రభుత్వ హత్యే.. రాష్ట్రంలో టెర్రరిస్టు పాలన కొనసాగుతోంది..

| Edited By:

Sep 16, 2019 | 11:35 PM

ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ.. మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. టీడీపీ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి మాజీ స్పీకర్‌ కోడెలపై ఫర్నీచర్‌ దొంగతనం మోపి మానసిక క్షోభకు గురి చేశారంటూ మండిపడ్డారు. కోడెలను సొంత కొడుకే చంపేశాడంటూ వార్తలు నడిపి.. చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. కోడెల మృతి పట్ల.. రేపు, […]

కోడెలది ప్రభుత్వ హత్యే.. రాష్ట్రంలో టెర్రరిస్టు పాలన కొనసాగుతోంది..
Follow us on

ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ.. మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. టీడీపీ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి మాజీ స్పీకర్‌ కోడెలపై ఫర్నీచర్‌ దొంగతనం మోపి మానసిక క్షోభకు గురి చేశారంటూ మండిపడ్డారు. కోడెలను సొంత కొడుకే చంపేశాడంటూ వార్తలు నడిపి.. చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. కోడెల మృతి పట్ల.. రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా కోడెలకు సంతాపాలు ప్రకటించాలని సూచించారు. ఇలాంటి టెర్రరిస్టు ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పల్నాటి పులిగా పేరొందిన కోడెలను ఆత్మహత్యకు ఉసిగొలిపిన కారణాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ కుట్రలపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఓ పద్ధతి అంటూ లేకుండా పాలన చేస్తున్నారని విమర్శించారు. అమరావతి, పోలవరం, పీపీఏల రద్దుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. పురాణాల్లో రాక్షసులు పెట్టిన హింసల కథలు చదివామని.. కానీ ఇప్పుడు జగన్ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.