బీజేపీ-జనసేన చెలిమి.. చంద్రబాబు ఏమన్నారంటే.?

|

Jan 19, 2020 | 12:19 PM

ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 2024 ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక ఈ కీలక పరిణామంతో టీడీపీ పతనం తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బీజేపీ-జనసేన పొత్తును స్వాగతించారు. అవునండీ మీరు విన్నది నిజమే. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ-జనసేన పార్టీల పొత్తును స్వాగతిస్తున్నాం. ఆ రెండు […]

బీజేపీ-జనసేన చెలిమి.. చంద్రబాబు ఏమన్నారంటే.?
Follow us on

ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 2024 ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక ఈ కీలక పరిణామంతో టీడీపీ పతనం తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బీజేపీ-జనసేన పొత్తును స్వాగతించారు. అవునండీ మీరు విన్నది నిజమే. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘బీజేపీ-జనసేన పార్టీల పొత్తును స్వాగతిస్తున్నాం. ఆ రెండు పార్టీలూ కలిసి ఏపీ రాజధాని అమరావతిలో ఉండేలా చేస్తే మంచిదని ఆయన అన్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఈ కూటమి మద్దతు తెలపాలని.. రాజధాని విశాఖకు తరలిపోకుండా ఆపాలని చంద్రబాబు కోరారు. ఇదిలా ఉంటే బీజేపీతో జనసేన పొత్తు వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవన్‌నడిపించేది చంద్రబాబేనని.. బీజేపీతో పొత్తు కుదిరేలా వ్యూహాలు రచించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నాడు కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్ళు పట్టుకున్నా, నేడు కమలం వైపు కదిలినా అన్ని కూడా పవన్‌ను వెనక నుంచి ఆదేశించేది ఆయనేనని ఆరోపించారు.