#Chandrababu writes చిన్నపాముకే పెద్ద కర్ర.. బాబు చాలా స్మార్ట్ గురూ!

|

Apr 07, 2020 | 5:20 PM

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. పెద్దల మాటను తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని, తర్వాత వదిలేసి ఏపీ పోలీసులపై ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు చంద్రబాబు.

#Chandrababu writes చిన్నపాముకే పెద్ద కర్ర.. బాబు చాలా స్మార్ట్ గురూ!
Follow us on

Chandrababu writes letter to AP Governor Bishwabhushan: చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. పెద్దల మాటను తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని, తర్వాత వదిలేసి ఏపీ పోలీసులపై ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యే అరెస్టుపై ఏకంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ మంగళవారం లేఖ రాశారు.

రైతు సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్‌ చేశారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో కలెక్టర్‌ స్పందించకపోవడంతో నేరుగా వెళ్లి కలవాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భావించారని, అయితే కలెక్టర్ను కలిసేందుకు వెళుతున్న తరుణంలో తమ ఎమ్మెల్యేను భీమవరం వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కిపంపారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో నర్సాపురం, భీమవరం వైసీపీ ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించారని, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు వివరించారు. ఆంక్షలు కేవలం విపక్షాలకేనా.. పాలకపక్షం నేతలకు లేవా అని ఆయన ప్రశ్నించారు.

పశుసంవర్ధక శాఖమంత్రి, జిల్లా కలెక్టర్‌ కూడా 200 మందితో సమావేశం నిర్వహిస్తే వారిపైనా ఎలాంటి చర్యలు లేవని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలపై, ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకుంటున్నారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని చంద్రబాబు గవర్నర్‌ను కోరారు.