చందమామ బొమ్మల తాతయ్య ఇక లేరు

|

Sep 29, 2020 | 9:56 PM

Chandamama Artist Sivasankaran : చందమామ బొమ్మల తాతయ్య ఇక సెలవంటూ వెళ్లిపోయారు. భారతీయ బొమ్మల కథలకు ప్రాణం పోసిన మహనీయుడు తన రంగుల చిత్రాన్ని ముగించారు. చందమామ కథల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ తాతయ్య ఇక లేరు. 97 ఏళ్ల ‘చందమామ’ శంకర్ తాతయ్య మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు  వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు కరత్తొలువు చంద్రశేఖరన్ […]

చందమామ బొమ్మల తాతయ్య ఇక లేరు
Follow us on

Chandamama Artist Sivasankaran : చందమామ బొమ్మల తాతయ్య ఇక సెలవంటూ వెళ్లిపోయారు. భారతీయ బొమ్మల కథలకు ప్రాణం పోసిన మహనీయుడు తన రంగుల చిత్రాన్ని ముగించారు. చందమామ కథల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ తాతయ్య ఇక లేరు.

97 ఏళ్ల ‘చందమామ’ శంకర్ తాతయ్య మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు  వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు కరత్తొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924లో తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన శంకర్ 1946 నుంచి ఆఖరి శ్వాసవరకు బొమ్మలే జీవితంగా గడిపారు.

చందమామ పత్రిక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో వెలువడ్డంతో ఆయన దేశమంతా తెలిసిన కళాకారుడయ్యారు. భేతాళకథల బొమ్మలు సహా ఎన్నో సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. పిల్లలను, పెద్దలు అనే తేడా లేకుండా ఆకట్టుకునే ఆయన బొమ్మలు తీరుతెన్నులు అచ్చం భారతీయమైనవే. బాల్యం నుంచే చిత్రాలపై ఆసక్తి చూపిన శంకర్ 1941లో మద్రాస్ గవర్నమెంట్ ఫైనార్ట్స్ కాలేజీలో చేరి శిక్షణ పొందారు. నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ అతని కెరీర్‌కు బాటలు వేసింది.

1951లో చందమామలో చేరిన శివశంకరన్‌.. 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. ఆ పత్రికలో చిత్రకారుల బృందానికి శివశంకరన్‌ నేతృత్వం వహించారు. చందమామ మూతపడ్డాక ‘రామకృష్ణ విజయం’ పత్రికలో బొమ్మలు గీశారు. 93 ఏళ్ల వయసులోనూ మ్యాగజైన్‌కు శివశంకరన్‌ బొమ్మలు గీయడం విశేషం. ఆయన మృతిపట్ల పలువురు చిత్రకారులు సంతాపం తెలిపారు.