CTet 2020 : కరోనా వ్యాప్తితో వాయిదా పడిన వివిధ రకాల పరీక్షలు ఇప్పుపుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాయి. ఇలా వాయిదాపడిన సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (C Tet) పరీక్ష తేదీలను సీబీఎస్సీ(CBSC) ప్రకటించింది. పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ ఏడాది మరికొన్ని నగరాల్లో పరీక్ష కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తోంది. దీంతో పరీక్ష కేంద్రాలను మార్చుకునేవారికోసం నవంబర్ 7 నుంచి 16 వరకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా సుమారు 135 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. www.ctet.nic.in వెబ్సైట్లో పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చని వెల్లడించింది.
పరీక్షలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు.
పరీక్ష విధానం..(పీఆర్టీ) (టీజీటీ)