సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం… పది, ఇంటర్ విద్యార్థులకు షాక్!

| Edited By:

Aug 11, 2019 | 7:57 PM

సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజులను భారీగా పెంచింది. 10వ తరగతి, 12వ తరగతి చదివే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ఇన్నాళ్లూ చెల్లిస్తూ వస్తున్న 50 రూపాయల పరీక్ష ఫీజును 1,200 రూపాయలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు ప్రస్తుతం చెల్లిస్తున్న 750 రూపాయలకు రెట్టింపు.. అంటే 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు పెంచారు. గత వారమే ఈ పరీక్ష ఫీజుల […]

సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం... పది, ఇంటర్ విద్యార్థులకు షాక్!
Follow us on
సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజులను భారీగా పెంచింది. 10వ తరగతి, 12వ తరగతి చదివే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు ఇన్నాళ్లూ చెల్లిస్తూ వస్తున్న 50 రూపాయల పరీక్ష ఫీజును 1,200 రూపాయలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు ప్రస్తుతం చెల్లిస్తున్న 750 రూపాయలకు రెట్టింపు.. అంటే 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు పెంచారు. గత వారమే ఈ పరీక్ష ఫీజుల పెంపుకు సంబంధించి స్కూళ్లకు ఆదేశాలు అందాయి. పెంచిన ఫీజులను కట్టించుకోవాలని బోర్డ్ స్పష్టం చేసింది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఈ పెంచిన ఫీజులు వర్తిస్తాయి.