దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ ఆకస్మిక సోదాలు!

| Edited By:

Aug 30, 2019 | 11:00 PM

అవినీతి పరుల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 150 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. భారీ స్థాయిలోనే అవకతవకలను పాల్పడిన శాఖలను గుర్తించిన సీబీఐ ఆ యా శాఖలపై ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీనగర్‌ సహా 30 నగరాల్లో దాదాపు 150 ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయని సీబీఐ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, షిప్పింగ్‌, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, […]

దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ ఆకస్మిక సోదాలు!
Follow us on

అవినీతి పరుల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఏకకాలంలో 150 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. భారీ స్థాయిలోనే అవకతవకలను పాల్పడిన శాఖలను గుర్తించిన సీబీఐ ఆ యా శాఖలపై ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీనగర్‌ సహా 30 నగరాల్లో దాదాపు 150 ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయని సీబీఐ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, షిప్పింగ్‌, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, బొగ్గు, ఆహార, కస్టమ్స్‌, విద్యుత్‌, మున్సిపల్‌, కంటోన్మెంట్‌, అగ్నిమాపక, పరిశ్రమలు, జీఎస్టీ, రవాణా, విదేశీ వాణిజ్యం, పురావస్తు శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర విభాగాల్లో సీబీఐ తనిఖీలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌, శ్రీనగర్‌, దిల్లీ, జైపూర్‌, జోధ్‌పూర్‌, గువహటి, షిల్లాంగ్‌, చండీగఢ్‌, సిమ్లా, చెన్నై, మధురై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, పుణె, గాంధీనగర్‌, గోవా, భోపాల్‌, జబల్‌పూర్‌, నాగ్‌పూర్‌, పట్నా, రాంచీ, ఘజియాబాద్‌, డెహ్రాడూన్‌, లఖ్‌నవూ, వడోదర, అహ్మదాబాద్‌, కొచ్చి నగరాల్లో సీబీఐ సోదాలు సాగుతున్నట్లు అధికారి వెల్లడించారు. అయితే, దేశ వ్యాప్తంగా సీబీఐ ఆకస్మిక సోదాలకు గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.