పోర్న్ చూస్తున్నారా..? సీబీఐ కేసులకు సిద్దపడండి..

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 6:08 PM

ఇప్పుడు పోర్న్ ఎంత విచ్చలవిడిగా పెరిగిందో అందరికి తెలిసిందే. ఇంటర్నెట్‌ వినియోగం పెరగటంతోపాటు, సెల్‌ఫోన్ల వల్ల దీని వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. పోర్న్ ప్రభావంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వావి వరసలు, చిన్నపిల్లలన్న ఇంగితం కూడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా ఉన్న చైల్డ్ పోర్న్‌ను నివారించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోరకు బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం-ఓసీఎస్​ఏఈ పేరిట ఢిల్లీలో సెపరేట్ వ్యవస్థను, టీమ్‌ను […]

పోర్న్ చూస్తున్నారా..? సీబీఐ కేసులకు సిద్దపడండి..
Follow us on

ఇప్పుడు పోర్న్ ఎంత విచ్చలవిడిగా పెరిగిందో అందరికి తెలిసిందే. ఇంటర్నెట్‌ వినియోగం పెరగటంతోపాటు, సెల్‌ఫోన్ల వల్ల దీని వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. పోర్న్ ప్రభావంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వావి వరసలు, చిన్నపిల్లలన్న ఇంగితం కూడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా ఉన్న చైల్డ్ పోర్న్‌ను నివారించేందుకు చర్యలు ప్రారంభించింది.

ఇందుకోరకు బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం-ఓసీఎస్​ఏఈ పేరిట ఢిల్లీలో సెపరేట్ వ్యవస్థను, టీమ్‌ను స్థాపించింది. సీబీఐ స్పెషల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పరిధిలో ఓసీఎస్​ఏఈ పనిచేయనుంది. ఈ స్పెషల్ టీం.. చిన్నపిల్లలతో కూడిన నీలి చిత్రాలను అప్‌లోడ్ చేస్తోన్న, వాటిని చూస్తోన్న వారిపై  కేసులు పెట్టి ..బెండు తీయనుంది. వారిపై  ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు.. పోక్సో చట్టం, ఐటీ యాక్ట్ (2000) కింద  కేసులు నమోదు చెయ్యనుంది.