సుశాంత్ ఆత్మహత్య కేసు.. వేగం పెంచిన సీబీఐ‌.!

|

Aug 23, 2020 | 7:43 PM

Sushant Death Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే క్రైమ్ సీన్‌ను రీ-క్రియేట్ చేసిన సీబీఐ.. పలువురు సాక్ష్యులను కూడా విచారించడం జరిగింది. సుశాంత్ ఇంటి పనివాడు నీరజ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన అతడి స్నేహితుడు సిద్ధార్థ్ పితానిల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. సుశాంత్ చనిపోయే కొన్ని గంటల ముందు అసలు ఏం జరిగింది.? ఎవరెవరు అతనితో ఉన్నారు.? అనే వివరాలను సీబీఐ సేకరిస్తోంది. అంతేకాకుండా అతడి […]

సుశాంత్ ఆత్మహత్య కేసు.. వేగం పెంచిన సీబీఐ‌.!
Follow us on

Sushant Death Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే క్రైమ్ సీన్‌ను రీ-క్రియేట్ చేసిన సీబీఐ.. పలువురు సాక్ష్యులను కూడా విచారించడం జరిగింది. సుశాంత్ ఇంటి పనివాడు నీరజ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన అతడి స్నేహితుడు సిద్ధార్థ్ పితానిల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.

సుశాంత్ చనిపోయే కొన్ని గంటల ముందు అసలు ఏం జరిగింది.? ఎవరెవరు అతనితో ఉన్నారు.? అనే వివరాలను సీబీఐ సేకరిస్తోంది. అంతేకాకుండా అతడి నివాసంలోని కీలక ఆధారాలను కూడా సేకరించింది. అటు జూన్ 14న రికార్డు అయిన సీసీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. కాగా, జూన్ 14వ తేదీ రాత్రి సుశాంత్ తనతో నార్మల్‌గానే మాట్లాడాడని సిద్ధార్థ్, సీబీఐకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రియా.. సుశాంత్ ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయిందన్న దానిపై సీబీఐ సిద్ధార్ధ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, ఈ కేసులో సిద్ధార్థ్ స్టేట్‌మెంట్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.