ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు

|

Oct 08, 2020 | 4:25 PM

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టాయి. ఇండ్‌ భారత్‌ కంపెనీతో సహా 8 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. పంజాబ్‌ బ్యాంక్‌ను మోసం..

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు
Raghu ramakrishna raju
Follow us on

MP Raghurama Krishnam raju  :  ఎంపీ రఘురామకృష్ణంరాజు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, ముంబైలోని ఆఫీసుల్లో ఉదయం నుంచి 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇండ్‌ భారత్‌ సహా 8 కంపెనీల డైరెక్టర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను చీట్‌ చేసిన కేసులో ఈ దాడులు చేస్తున్నారు. 826 కోట్ల రూపాయల లోన్‌ఫ్రాడ్‌ కేసులో సీబీఐ ఈ తనిఖీలు చేపట్టింది. దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 6న రఘురామకృష్ణంరాజుపై ఢిల్లీ సీబీఐ కేసు నమోదుచేసింది. ఇండ్‌ భారత్‌కు చెందిన 10 మంది డైరెక్టర్లపై కూడా కేసు నమోదయ్యింది.

నిందితుల జాబితాలో రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కూతురు ప్రియ దర్శిని ఉన్నారు. SBI, IOB, PNB, Axisకు చెందిన కన్సార్టియంను మోసం చేసింది ఇండ్ భారత్. ఇండ్‌ భారత్‌ పవర్‌ ప్లాంట్‌ను కర్నాటకలో పెడతామని చెప్పి..తమిళనాడుకు మార్చామని బ్యాంక్‌లకు తెలిపారు డైరెక్టర్లు.