జీవీకే గ్రూపుపై సీబీఐ న‌జ‌ర్.. వందల కోట్లలో నిధుల దుర్వినియోగం..!

|

Jul 02, 2020 | 11:56 AM

జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ ఎండీ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

జీవీకే గ్రూపుపై సీబీఐ న‌జ‌ర్.. వందల కోట్లలో నిధుల దుర్వినియోగం..!
Follow us on

జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ ఎండీ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2012-18 మధ్య కాలంలో అక్ర‌మ‌ మార్గంలో రూ.705 కోట్లు ఆర్జించారనే కారణంతో ఈకేసు నమోదైంది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ‌.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబయి ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ కోసం.. గ‌వ‌ర్న‌మెంట్, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో రిజర్వ్ ఫండ్‌ను దుర్వినియోగం చేయడం, బోగస్ వర్క్ కాంట్రాక్టులు, ఖర్చు అంచనాలను పెంచడం ద్వారా నిధులను దారి మ‌ళ్లించిన‌ట్టు సీబీఐ పేర్కొంది. ఈ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి జీవీకే రెడ్డి, సంజయ్‌రెడ్డితో పాటు జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మియాల్‌, మరో తొమ్మిది కంపెనీలు, విమానాశ్ర‌యం అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది.