మినహాయింపు పిటిషన్‌పై విచారణ వాయిదా

|

Jan 31, 2020 | 1:56 PM

వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్థనపై విచారణను సీబీఐ కోర్టు ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి శుక్రవారం (జనవరి 31) జగన్‌ను తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. అయితే, తనకు అత్యంత ముఖ్యమైన సమీక్షా సమావేశాలున్నందున తాను హాజరుకాలేకపోతున్నానని జగన్.. తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. దాంతోపాటు.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున తనకు కొంతకాలంపాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ […]

మినహాయింపు పిటిషన్‌పై విచారణ వాయిదా
Follow us on

వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్థనపై విచారణను సీబీఐ కోర్టు ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి శుక్రవారం (జనవరి 31) జగన్‌ను తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. అయితే, తనకు అత్యంత ముఖ్యమైన సమీక్షా సమావేశాలున్నందున తాను హాజరుకాలేకపోతున్నానని జగన్.. తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు.

దాంతోపాటు.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున తనకు కొంతకాలంపాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ జగన్ గతంలో వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారించింది. సీబీఐ దర్యాప్తు బ‌ృందానికి వున్న అభ్యంతరాలను కోరింది సీబీఐ కోర్టు. అయితే, తమ అభ్యంతరాలను తెలిపేందుకు సీబీఐ దర్యాప్తు బృందం వారం రోజుల సమయం కోరడంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఫిబ్రవరి 7వ తేదీలోగా అభ్యంతరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.