కరోనా టైమ్ : పెళ్లికి కట్‌ అవుట్‌లే అతిథులు‌

|

Sep 14, 2020 | 4:18 PM

పెళ్లి అంటే ఓ ఆనందం..పెళ్లి అంటే ఉత్సహం, పెళ్లి అంటే ఇళ్లంతా బంధువుల కోలాహలం. కానీ ప్రస్తుతం కరోనా టైమ్. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టమైన పెళ్లికి కూడా ఎవర్నీ ఆహ్వానించే పరిస్థితి లేదు.

కరోనా టైమ్ : పెళ్లికి కట్‌ అవుట్‌లే అతిథులు‌
Follow us on

పెళ్లి అంటే ఓ ఆనందం..పెళ్లి అంటే ఉత్సహం, పెళ్లి అంటే ఇళ్లంతా బంధువుల కోలాహలం. కానీ ప్రస్తుతం కరోనా టైమ్. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టమైన పెళ్లికి కూడా ఎవర్నీ ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో పెళ్లిళ్లు కళ తప్పాయి. 10 మంది మధ్యలో తూతూ మంత్రంగా వివాహాన్ని ముగించాల్సి వస్తుంది. కానీ ఇంగ్లండ్ లో ఓ పెళ్లిజంట మాత్రం తమ జీవితంలో నిలిచిపోవాల్సిన వేడుకలో బంధువులు, మిత్రులు లేకపోతే ఎలా అని మదనపడ్డారు. ఈ క్రమంలోనే వారు కాస్త క్రేజీగా ఆలోచించారు.  2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి (రెండు వేల పౌండ్‌ లకు పైగా) 48 మంది గెస్టుల్ని పెళ్లికి ఆహ్వానించారు.

అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న కోవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లిలో 30 మంది అతిథులకు మించి ఆహ్వానించకూడాదు. మరి వీళ్లు అంతమందిని ఎలా పిలిచారు అనుకుంటున్నారా?. అక్కడే ఉంది అసలు విషయం. కార్డ్‌ బోర్డులతో అతిథుల  కట్‌ అవుట్‌ లు చేయించుకుని, పెళ్లికి ట్రాన్స్‌ పోర్ట్‌ చేయించుకున్నారు. పెళ్లి అనంతరం వాటి పక్కన నిలబడి ఎంచక్కా ఫొటోలు దిగేశారు. పెళ్లికూతురి పేరు రోమీ. ఆమెదేనట ఈ క్రేజీ ఐడియా. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఐడియాకు హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

 కొత్త తరహా మోసం, హైదరాబాదీలూ తస్మాత్ జాగ్రత్త !