కరోనా ధాటికి.. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ రద్దు..?

| Edited By:

Mar 13, 2020 | 6:02 PM

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 5000 మంది మరణించారు. లక్షకు పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో

కరోనా ధాటికి.. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ రద్దు..?
Follow us on

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 5000 మంది మరణించారు. లక్షకు పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో పెద్ద పెద్ద ఈవెంట్స్ రద్దు అవుతున్నాయి. భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

కరోనా కారణంగా.. ప్రతీ ఏడాది వేసవిలో ప్రాన్స్ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయాని తెలుస్తోంది. ఈ ఏడాది క్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మే 12న మొదలు కావాలి. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఈ ఫెస్టివల్ జరుగుతుందో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ‘మార్చి నెలాఖరులోగా కరోనా తీవ్రత తగ్గుతుందనే ఆశతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫెస్టివల్‌ను రద్దు చేసే అవకాశం ఉంది’ అన్నారు కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రెసిడెంట్‌ పీర్రీ లీస్కూర్‌.

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు!