ByteDance: ఉద్యోగులను తొలగిస్తోన్న టిక్‌టాక్ మాతృ సంస్థ..? ‘నిషేధం కొంత కాలమే ఉంటుందనుకున్నామంటూ’ ఉద్యోగులకు లేఖ..

|

Jan 27, 2021 | 7:24 PM

ByteDance cuts India workforce: భారత్, చైనా దేశల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన యూజర్ల సమాచారాన్ని ఈ యాప్‌లు..

ByteDance: ఉద్యోగులను తొలగిస్తోన్న టిక్‌టాక్ మాతృ సంస్థ..? ‘నిషేధం కొంత కాలమే ఉంటుందనుకున్నామంటూ’ ఉద్యోగులకు లేఖ..
Follow us on

ByteDance cuts India workforce: భారత్, చైనా దేశల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన యూజర్ల సమాచారాన్ని ఈ యాప్‌లు సేకరిస్తున్నాయన్న కారణంతో భారత్ వీటిని బ్యాన్ చేసింది.
భారత్ నిషేధించిన యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. టిక్‌టాక్‌కు అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా ఉన్న భారత్ బ్యాన్ చేయడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రభావం ఈ కంపెనీలో పనిచేస్తోన్న ఉద్యోగులపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బైట్ డ్యాన్స్ తమ ఉద్యోగులకు ఓ లేఖ జారీ చేసింది. ఇందులో.. ‘ఇండియాలో టిక్‌టాక్ నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని భావించాం, కానీ అలా జరగలేదు. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగించలేము. రానున్న రోజుల్లో భారత్‌లో టిక్‌టాక్ మళ్లీ ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం’ అంటూ ఉద్యోగులకు అందజేసిన లేఖలో సంస్థ పేర్కొంది. మరి బైట్‌డ్యాన్స్ ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుంది.? ఈ అనిశ్చితికి ఎప్పుడు బ్రేక్ పడుతుందనేది వేచి చూడాలి.

Also Read: Google Duo: ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో యాప్ నిలిచిపోనుందా?.. ఆ మెసేజ్ అందుకే వస్తోందా?..