భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వెంట సొరంగం.. బట్టబయలు చేసిన బీఎస్‌ఎఫ్‌

|

Nov 05, 2020 | 6:20 PM

జమ్మూ-కశ్మీర్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు బుధవారం కనుగొన్నాయి.

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వెంట సొరంగం.. బట్టబయలు చేసిన బీఎస్‌ఎఫ్‌
Follow us on

జమ్మూ-కశ్మీర్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు బుధవారం కనుగొన్నాయి. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో బయటపడిన ఈ సొరంగ మార్గాన్ని పరిశీలించేందుకు అక్కడికి సరిహద్దు రక్షణ దళం సీనియర్‌ అధికారుల బృందం చేరుకుంది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చేందుకు పన్నాగం పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సొరంగ మార్గాలను బీఎస్‌ఎఫ్‌ బట్టబయలు చేసిందని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడటానికి, ఆయుధాలను, మాదకద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడానికి ఈ సొరంగమార్గాలను ఉపయోగిస్తున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.