ఏపీ అగ్రికల్చర్, హార్టీకల్చర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రైవేట్ కాలేజీల ఫీజులు ఖరారు.!

|

Dec 21, 2020 | 9:55 PM

Agriculture And Horticulture Fees: ఏపీలోని అగ్రికల్చర్, హార్టీకల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. అగ్రికల్చర్

ఏపీ అగ్రికల్చర్, హార్టీకల్చర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రైవేట్ కాలేజీల ఫీజులు ఖరారు.!
Follow us on

Agriculture And Horticulture Fees: ఏపీలోని అగ్రికల్చర్, హార్టీకల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. అగ్రికల్చర్, హార్టీకల్చర్ బీఎస్సీ కోర్సులకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21, 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు ఖరారు చేసిన ఫీజులు అమలులోకి రానున్నాయి. అగ్రికల్చర్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 1,10,840గా ఖరారు చేయగా.. మేనేజ్‌మెంట్ కోటా ఫీజును రూ. 2,01,940గా ఫిక్స్ చేసింది.

అలాగే హార్టీకల్చర్ కోర్సు కన్వీనర్ కోటా ఫీజును రూ. 1,05,790గా,  హార్టీకల్చర్ మేనేజ్‌మెంట్ కోటా ఫీజును రూ. 1,91,840గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆయా కోర్సుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మించి వసూలు చేయకూడదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ కాలేజీలను విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.