ప్రారంభించిన నెల రోజులకే కుప్పకూలిన బ్రిడ్జ్.. వీడియో వైరల్..

| Edited By:

Jul 16, 2020 | 12:47 PM

రుతుపవనాల ప్రభావంతో అసోం, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలను వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లోని న‌దులు, సాగునీటి ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. అయితే బీహార్ లోని గోపాల్ గంజ్

ప్రారంభించిన నెల రోజులకే కుప్పకూలిన బ్రిడ్జ్.. వీడియో వైరల్..
Follow us on

రుతుపవనాల ప్రభావంతో అసోం, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలను వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లోని న‌దులు, సాగునీటి ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. అయితే బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో గండ‌‌క్ న‌దిపై నిర్మించిన స‌త్తార్ ఘాట్ బ్రిడ్జి వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో కుప్ప‌కూలిపోయింది. కొత్త‌గా నిర్మించిన ఈ బ్రిడ్జిని గ‌త నెల‌లోనే సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు.

నూతనంగా నిర్మించిన బ్రిడ్జి నెల లోపులోనే కుప్ప‌కూలిపోవ‌డంతో స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వంతెనను రూ. 264 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి నాణ్య‌త లేకుండా బ్రిడ్జి నిర్మించ‌డంపై ప్ర‌భుత్వాన్ని జ‌నాలు నిల‌దీస్తున్నారు. ఈ బ్రిడ్జి కూలిపోవ‌డంతో.. చంపార‌న్, స‌రన్ తో పాటు మ‌రిన్ని జిల్లాల‌కు సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

[svt-event date=”16/07/2020,12:37PM” class=”svt-cd-green” ]

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!