లడఖ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఊహించని పర్యటన..

|

Jul 03, 2020 | 11:38 AM

ప్రధాని నరేంద్రమోదీ సడ‌న్ గా లడఖ్ పర్యటనకు వెళ్లారు. లడఖ్‌లో భార‌త్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... అక్కడ పరిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గ‌మ‌నిస్తోంది.

లడఖ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఊహించని పర్యటన..
Follow us on

ప్రధాని నరేంద్రమోదీ సడ‌న్ గా లడఖ్ పర్యటనకు వెళ్లారు. లడఖ్‌లో భార‌త్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో… అక్కడ పరిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని హఠాత్తుగా లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా దళాల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా మోదీ.. పర్యటన కొనసాగుతోంది.  నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ పర్యటన వాయిదా పడింది. కానీ ఊహించ‌ని విధంగా స్వయంగా ప్ర‌ధాని ఇక్కడికి రావడం విశేషం. మోదీతో పాటు త్రివిధ ద‌ళాల చీఫ్ బిపిన్ రావ‌త్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు లడఖ్ చేరుకున్నారు. . వారితో ఇక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఆయన స్వయంగా భార‌త సైనికుల‌తో ‌ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ఏరియాలో ఉండే జంక్సర్ రేంజ్‌కు మోదీ వెళ్లినట్టు స‌మాచారం. గాల్వన్ ఘటనలో గాయపడి లేహ్ హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ సైనికులను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు.

ఇప్పటికే డ్రాగన్‌పై డిజిటల్‌ స్ట్రైక్‌ చేసిన ప్రధాని మోదీ..నెక్స్ట్‌ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. జూన్‌ 15న డ్రాగన్‌ హద్దులు దాటి ప్రవర్తించింది. వెయ్యి మంది వరకు చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించి..మన సైనికుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. మన జవాన్లను గాల్వన్‌ నదిలో ముంచి ఊపిరాడకుండా హతమార్చారు. చైనా దొంగ‌దెబ్బ‌తో 20 మందికి పైగా భారత సైనికులు బలయ్యారు. డ్రాగన్‌ భారత జవాన్ల పట్ల..అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించడంపై రగిలిపోతున్నారు మోదీ. పైకి శాంతి వచనాలు వల్లిస్తూనే..దొంగ దెబ్బ తీయడంతో చైనాతో ఢీ అంటే ఢీ అంటున్నారు.