Breaking: ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామకం..

|

Apr 11, 2020 | 9:45 AM

Breaking News:  ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ న్యాయమూర్తిగా పని చేసిన ఆయన.. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. ప్రస్తుతం స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించారు. కాగా, విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి వి.కనగరాజ్‌ కీలక తీర్పులు ఇచ్చిన సంగతి […]

Breaking: ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామకం..
Follow us on

Breaking News:  ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ న్యాయమూర్తిగా పని చేసిన ఆయన.. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. ప్రస్తుతం స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించారు. కాగా, విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి వి.కనగరాజ్‌ కీలక తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆర్డినెన్స్ స‌వ‌ర‌ణ ద్వారా రమేష్ కుమార్‌కు ఉద్వాస‌న ప‌లికింది ఏపీ ప్ర‌భుత్వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేష‌న్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన స‌ర్కార్.. దాన్ని గవర్నర్‌కు పంపగా.. వెంటనే ఆయన నుంచి గ్రీన్ సిగ్న‌ల్ లభించింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం.. వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్‌ను తప్పించింది.

ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..