త‌న‌‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్ల పేర్లు బిడ్డ‌కు పెట్టిన‌ బ్రిట‌న్ ప్ర‌ధాని….

|

May 03, 2020 | 11:13 AM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డేంజ‌ర‌స్ క‌రోనా వైర‌స్ తో పోరాటం చేసి విజయం సాధించారు. కాగా ఇటీవ‌లే ఆయ‌న‌ భార్య క్యారీ సీమండ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మృత్యు ఒడిలోకి వెళ్లిన త‌న‌కు వైద్యం చేసిన కాపాడిన డాక్ట‌ర్స్ రుణం తీర్చుకున్నారు బోరిస్ జాన్స‌న్. కుమారుడికి త‌న‌కు ట్రీట్మెంట్ చేసిన డాక్ట‌ర్స్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ సోష‌ల్ మీడియా ద్వారా శనివారం వెల్లడించారు. కోవిడ్-19 కు ట్రీట్మెంట్ […]

త‌న‌‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్ల పేర్లు బిడ్డ‌కు పెట్టిన‌ బ్రిట‌న్ ప్ర‌ధాని....
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డేంజ‌ర‌స్ క‌రోనా వైర‌స్ తో పోరాటం చేసి విజయం సాధించారు. కాగా ఇటీవ‌లే ఆయ‌న‌ భార్య క్యారీ సీమండ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మృత్యు ఒడిలోకి వెళ్లిన త‌న‌కు వైద్యం చేసిన కాపాడిన డాక్ట‌ర్స్ రుణం తీర్చుకున్నారు బోరిస్ జాన్స‌న్. కుమారుడికి త‌న‌కు ట్రీట్మెంట్ చేసిన డాక్ట‌ర్స్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ సోష‌ల్ మీడియా ద్వారా శనివారం వెల్లడించారు. కోవిడ్-19 కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. సీమండ్స్ తాత లౌరీ.. జాన్సన్‌కు ట్రీట్మెంట్ అందించిన‌ వైద్యులు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు.

మార్చి నెలాఖ‌రులో బ్రిటన్ ప్రధానికి కోవిడ్-19 సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. కాగా ఆయన ఇంటి వద్ద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా వ్యాధి న‌యం కాక‌పోవ‌డంతో ఏప్రిల్ 7న హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.