తీరుమారని బెంగాల్.. ఈ సారి టీఎంసీ కార్యకర్తలపై..

| Edited By:

Jun 15, 2019 | 1:56 PM

బెంగాల్ తీరు మారలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న రాజకీయ దాడులు, హత్యలు.. ఇప్పటి వరకు టీఎంసీ, బీజేల మధ్య జరగ్గా..  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదంలోకి చేరింది. రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్తలే టార్గెట్‌గా నాటు బాంబులతో దాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు మృతిచెందారు. జిల్లాలోని దోమకల్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి టీఎంసీ కార్యకర్తలు ఖైరుద్దీన్ షేక్, సోహెల్ రానాలు ఇంట్లో నిద్రపోతుండగా […]

తీరుమారని బెంగాల్.. ఈ సారి టీఎంసీ కార్యకర్తలపై..
Follow us on

బెంగాల్ తీరు మారలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న రాజకీయ దాడులు, హత్యలు.. ఇప్పటి వరకు టీఎంసీ, బీజేల మధ్య జరగ్గా..  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదంలోకి చేరింది. రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్తలే టార్గెట్‌గా నాటు బాంబులతో దాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు మృతిచెందారు. జిల్లాలోని దోమకల్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి టీఎంసీ కార్యకర్తలు ఖైరుద్దీన్ షేక్, సోహెల్ రానాలు ఇంట్లో నిద్రపోతుండగా కొందరు వ్యక్తులు బాంబులు వేశారు. ఈ ఘటనలో ఖైరుద్దీన్ షేక్, సోహెల్ రానాలు మరణించారు. కాంగ్రెస్ కార్యకర్తలే తమ ఇంటిపై దాడి చేసి..తన తండ్రిని చంపారని మృతుడు ఖైరుద్దీన్ కుమారుడు ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం తన మామయ్య అల్తాఫ్ హుసేన్‌ను కూడా చంపారని ఆరోపించారు. కాగా, ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.