‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు

| Edited By:

Jan 21, 2020 | 5:16 PM

అజయ్ దేవగణ్ వెల్‌కమ్ అంటూ ట్వీట్‌లో తెలిపారు. ఆయన్ని కలిసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవగణ్‌ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. అలాగే మొన్ననే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్‌ అయ్యింది. ఇప్పుడు అజయ్ దేవగణ్‌ కూడా షూటింగ్‌లో జాయిన్ అవడం చూస్తుంటే.. రాంచరణ్, అలియాలతో‌ పాటు ఆయన కాంబోలో షూటింగ్ జరుగుతుండవచ్చని తెలుస్తోంది. All of us are super charged and ecstatic to kickstart our schedule […]

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు
Follow us on

అజయ్ దేవగణ్ వెల్‌కమ్ అంటూ ట్వీట్‌లో తెలిపారు. ఆయన్ని కలిసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవగణ్‌ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. అలాగే మొన్ననే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్‌ అయ్యింది. ఇప్పుడు అజయ్ దేవగణ్‌ కూడా షూటింగ్‌లో జాయిన్ అవడం చూస్తుంటే.. రాంచరణ్, అలియాలతో‌ పాటు ఆయన కాంబోలో షూటింగ్ జరుగుతుండవచ్చని తెలుస్తోంది.

కాగా.. రాజమౌళి ట్వీట్‌కి అజయ్ దేవగణ్ స్పందించారు. ఆయనతో అనుబంధం 2012 నాటిదన్నారు. రాజమౌళితో పనిచేయడం గౌరవంతో పాటు నాకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు అయ్ దేవగణ్.

టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మల్టీలింగువల్ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.