ఈనెల 31న ఆకాశంలో అద్భుతం.. నీలి వెన్నెల జాబిల్లి కనువిందు..!

ఈనెల 31న ఆకాశ విపణిలో అద్బుతం కనువిందు చేయనుంది. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు జరగనున్నాయి.

ఈనెల 31న ఆకాశంలో అద్భుతం.. నీలి వెన్నెల జాబిల్లి కనువిందు..!

Updated on: Oct 29, 2020 | 7:53 AM

ఈనెల 31న ఆకాశ విపణిలో అద్బుతం కనువిందు చేయనుంది. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు జరగనున్నాయి. హాలోవీన్ వేడుకలు పురస్కరించుకుని విచిత్ర వేషధారణల మధ్య చేసుకునే ఉత్సవం. ఇదే సమయంలో వినీల ఆకాశంలో నీలి వెన్నెల జాబిల్లి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు పౌర్ణమి కావడంతో నిండుచంద్రుడు కనిపించనున్నాడు.

ఇది ఈ అక్టోబరు నెలలో ఏర్పడే రెండో పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు. బ్లూ మూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో రాత్రిపూట జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అనే పేరు వచ్చింది. బ్లూ మూన్ లేదా హంటర్ మూన్ అనేది సాధారణంగా ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. గతంలో 2018లో ఈ బ్లూ మూన్ ఏర్పడింది. ఈనెల 31న మనమంతా ఈ బ్లూ మూన్ వీక్షించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది తరువాత బ్లూమూన్ తిరిగి 2039లో ఏర్పడనుందని వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us