గోవా సీఎంగా ప్రమోద్ సావంత్.. అర్థరాత్రి 1.51 గంటలకు ప్రమాణ స్వీకారం..

| Edited By:

Mar 19, 2019 | 9:20 AM

పనాజీ : గోవాలో ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మంగళవారం 1.51 గంటలకు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం లుగా రామకృష్ణ ధవలీకర్, విజయ్ సర్దేశాయ్ కూడా ప్రమాణం చేశారు. గవర్నర్ మృదులా సిన్హా వారితో రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ప్రమోద్ సావంత్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. పారికర్ వారసుడెవరనే అంశంపై మిత్రపక్షాల ఏకాభిప్రాయం కోసం ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకూ సుదీర్ఘ సంప్రదింపులు, వాడివేడి చర్చలు […]

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్.. అర్థరాత్రి 1.51 గంటలకు ప్రమాణ స్వీకారం..
Follow us on

పనాజీ : గోవాలో ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మంగళవారం 1.51 గంటలకు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం లుగా రామకృష్ణ ధవలీకర్, విజయ్ సర్దేశాయ్ కూడా ప్రమాణం చేశారు. గవర్నర్ మృదులా సిన్హా వారితో రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ప్రమోద్ సావంత్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. పారికర్ వారసుడెవరనే అంశంపై మిత్రపక్షాల ఏకాభిప్రాయం కోసం ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకూ సుదీర్ఘ సంప్రదింపులు, వాడివేడి చర్చలు కొనసాగాయి. మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), స్వతంత్ర ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు కీలక చర్చలు జరిపారు. చివరకు గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ అభ్యర్థిత్వం వైపు వారంతా మొగ్గుచూపారు. జీఎఫ్‌పీ అధినేత విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ నేత రామకృష్ణ ధవలీకర్ డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టేందుకు అంగీకారం కుదిరింది.

రంగంలోకి నితిన్ గడ్కరీ, అమిత్‌షా

పారికర్ మరణం తర్వాత సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ, మిత్రపక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ రంగంలోకి దిగి వేగంగా పావులు కదిపింది. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఉదయమే గోవాకు చేరుకుని నేతలతో మంతనాలు జరిపారు. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మిత్రపక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చి సీఎం అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం దిశగా ప్రయత్నించారు. పారికర్ అంతిమయాత్రకు హాజరైన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా మిత్రపక్ష ఎమ్మెల్యేలతో ఓ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏకాభిప్రాయంతో సీఎం పదవికి అభ్యర్థిని ఎంపిక చేద్దామని ఆయన ప్రతిపాదించారు.