బ్రేకింగ్: బీజేపీ బుట్టలో దుష్యంత్..ఏం మాయ చేశారంటే..?

|

Oct 25, 2019 | 10:07 PM

హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-జేజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. భాజపాకు సీఎం, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం అమిత్​ షా ప్రభుత్వ ఏర్పాటు  ప్రకటన చేశారు. జేజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా […]

బ్రేకింగ్: బీజేపీ బుట్టలో దుష్యంత్..ఏం మాయ చేశారంటే..?
Follow us on

హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-జేజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. భాజపాకు సీఎం, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం అమిత్​ షా ప్రభుత్వ ఏర్పాటు  ప్రకటన చేశారు. జేజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.

డిప్యూటీ సీఎంగా దుష్యంత్!

జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా… అమిత్​ షాతో భేటీలలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. జేజేపీ డిమాండ్లకు అమిత్​ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దుష్యంత్​కు డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖాయమైంది