Bandi Sanjay: రాంలీలా మైదానం నుంచి మొదలైన బండి సంజయ్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

| Edited By: Ravi Kiran

Sep 12, 2022 | 4:15 PM

చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అనంతరం ర్యాలీగా వెళ్లి సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాంలీలా మైదానంలో..

Bandi Sanjay: రాంలీలా మైదానం నుంచి మొదలైన బండి సంజయ్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
Bandi Sanjay
Follow us on

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అనంతరం ర్యాలీగా వెళ్లి సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాంలీలా మైదానంలో బహిరంగ సభ అనంతరం 4వ విడత పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సంగ్రామయాత్ర నాలుగో విడత 10 రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్​తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్లు నడవనున్నారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 11 వందల 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు చేపట్టే యాత్రతో కలిపి.. 8 పార్లమెంట్​ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది.

పాదయాత్రలో భాగంగా ప్రతి రోజు సగటున బండి సంజయ్ 11 కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు. గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచారు. మహా నగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో రోజుకు 10 నుంచి 11 కిలోమీటర్లకే కుదించుకున్నారు.
ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ ఒక్కరోజు యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. 22న పెద్ద అంబర్​పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం