ఏపీలో ప్రమాదకరంగా ప్రభుత్వ తీరు, మూడు రాజధానుల గొడవ, ఆలయాల కూల్చివేత తప్పితే, మరొకటి వినిపించడం లేదు: రాం మాధవ్

|

Jan 23, 2021 | 8:10 PM

దేశంలో అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నా ఏపీలో మాత్రం మూడు రాజధానుల గొడవ, ఆలయాల కూల్చివేత తప్పితే..

ఏపీలో ప్రమాదకరంగా ప్రభుత్వ తీరు, మూడు రాజధానుల గొడవ, ఆలయాల కూల్చివేత తప్పితే, మరొకటి వినిపించడం లేదు: రాం మాధవ్
Follow us on

దేశంలో అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నా ఏపీలో మాత్రం మూడు రాజధానుల గొడవ, ఆలయాల కూల్చివేత తప్పితే మరొకటి వినిపించడం లేదన్నారు బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా ఉందన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన “Because India comes first” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రామ్ మాధవ్ పాల్గొన్నారు. పవర్ గేమ్, కులం, మతం, గుండాయిజం లాంటి రాజకీయాలే ఏపీలో కూడా కనిపిస్తున్నాయన్నారు రామ్ మాధవ్. రాజ్యాంగానికి విరుద్ధంగా కొంత మంది రైతులు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. సరిగా లేదంటూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందన్నారు రామ్ మాధవ్.