రాజధానిని ముంచేస్తారా? : సుజనా చౌదరి

| Edited By:

Aug 22, 2019 | 5:55 AM

ఏపీలో వరదల రాజకీయం సాగుతోంది. ప్రభుత్వం కావాలనే వరదనీటిని కిందికి వదిలిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఢిల్లీలో మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలపై సీడబ్ల్యూసీ ముందుగా హెచ్చిరించానా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదన్నారు. వరదలతో 50వేల ఎకరాల్లో పంటనష్టానికి బాధ్యులెవరంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని ప్రాంతాన్ని ముంచేయాలని చూస్తున్నారా అంటూ మండిపడ్డారు సుజనా చౌదరి. ప్రభుత్వ విధానంతో రాజధాని  ప్రాంత రైతులు, ప్రజలు ఆందోళనలో ఉన్నారని, మరోవైపు ఏపీ మంత్రులు బొత్స, […]

రాజధానిని ముంచేస్తారా? : సుజనా చౌదరి
Follow us on

ఏపీలో వరదల రాజకీయం సాగుతోంది. ప్రభుత్వం కావాలనే వరదనీటిని కిందికి వదిలిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఢిల్లీలో మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలపై సీడబ్ల్యూసీ ముందుగా హెచ్చిరించానా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదన్నారు. వరదలతో 50వేల ఎకరాల్లో పంటనష్టానికి బాధ్యులెవరంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని ప్రాంతాన్ని ముంచేయాలని చూస్తున్నారా అంటూ మండిపడ్డారు సుజనా చౌదరి.

ప్రభుత్వ విధానంతో రాజధాని  ప్రాంత రైతులు, ప్రజలు ఆందోళనలో ఉన్నారని, మరోవైపు ఏపీ మంత్రులు బొత్స, ఆవంతి శ్రీనివాస్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని విషయంలో ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారన్నారు. మరోవైపు టీడీపీ వ్యవహార శైలిపై కూడా సుజనా చౌదరి చురకలంటించారు. ఆ పార్టీ నేతలకు చంద్రబాబు ఇంటిసమస్యే ప్రధానంగా మారిందా అంటూ ఎద్దేవా చేశారు.