తిరుమల దేవాలయంపై బీజేపీ నేత వివాదాస్పద ట్వీట్.. 

|

Jun 14, 2020 | 12:39 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ నుంచి తిరుమల దేవాలయాన్ని తప్పించాలంటూ గతంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

తిరుమల దేవాలయంపై బీజేపీ నేత వివాదాస్పద ట్వీట్.. 
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ నుంచి తిరుమల దేవాలయాన్ని తప్పించాలంటూ గతంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని ఆయన మళ్లీ ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టులో తేల్చుకోవాలంటూ అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టులో చివరి దశలో ఉందంటూ సుబ్రమణ్య స్వామి తాజాగా వివాదాస్పద ట్వీట్ చేశారు. తిరుమల ఆలయం, తిరుచానూరు పద్మావతి దేవాలయంతో పాటు మొత్తం పదకొండు ఆలయాలతో దేశంలోనే అత్యంత ధనిక ఆలయమైన తిరుమల గత రెండు తరాలుగా ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉందని సుబ్రమణ్య స్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.

1987ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం హిందూధార్మిక క్షేత్రాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని ఆయన కోరారు. దార్మిక క్షేత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడం హిందువుల హక్కులకు వ్యతిరేకమని ఆయన అన్నారు. కాగా, సుబ్రమణ్య స్వామి చేసిన ఈ ట్వీట్‌ను రమణదీక్షితులు రీ-ట్వీట్ చేయడం గమనార్హం.